VRC సెంటర్ లో బీటేసినా..  మినీ బైపాస్ లో మాటేసినా.. – NDN News

VRC సెంటర్ లో బీటేసినా.. మినీ బైపాస్ లో మాటేసినా.. – NDN News

VRC సెంటర్ లో బీటేసినా..
మినీ బైపాస్ లో మాటేసినా..
చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో కామెంట్ చేసినా..
===================================
నెల్లూరు కుర్రోళ్ళకు స్పీడు ఎక్కువే.. కానీ ఇకపై మాత్రం కుర్రాళ్ల స్పీడుకు బ్రేకులు వేసుకోవాల్సిందే.. లేదంటే అస్సలు కుదరదు.. సరదాగా మినీ బైపాస్ రోడ్డులో బైక్ పై వెళ్తూ దారిలో కనిపించిన అమ్మాయిలను కామెంట్ చేస్తే అస్సలే కుదరదు..VRC సెంటర్ లో నిల్చొని అమ్మాయిలకు బీటేస్తామంటే తాట తీసేస్తారు. చిల్డ్రన్స్ పార్కులో సరదాగా ఆంటీలను కామెంట్ చేసినా అంతే సంగతి.. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో శక్తీ టీమ్స్ తిరుగుతున్నాయి. ఆ.. ఇవన్నీ మామూలే కదా అని లైట్ గా తీసుకోవద్దు.. ఎందుకంటే ఇప్పుడు ఈ శక్తి టీమ్స్ చాలా పవర్ ఫుల్. మహిళల భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ శక్తి టీమ్స్ పనిచేస్తాయి. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వెంటనే వాలిపోతారు. ఇందుకోసం శక్తీ టీం సభ్యులకు స్కూటీలను కూడా ఇచ్చారు. ఆకతాయిలను ఎదుర్కొనేందుకు వీరికి ప్రత్యేకంగా పెప్పర్ స్ప్రేతో పాటూ..ఓ కిట్ ను అందజేశారు. ప్రత్యేక పోలీసు డ్రెస్‌లో ఉండే శక్తి టీమ్స్‌ సభ్యులు నగరంలో నిత్యం గస్తీ నిర్వహిస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉంటారు. మహిళలను ఎవరైనా వేధించినా.. వెకిలి చేష్టలకు పాల్పడినా తక్షణమే వారిని అదుపులోకి తీసుకుంటారు. అమ్మాయిల వెంటబడి ఏడిపించే ఆకతాయిలు.. బస్టాపుల్లో ఆడపిల్లల్ని వేధించేవారు.. మద్యం తాగి హడావుడి చేసేవారు.. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. కాదని కట్టుదాటారా.. ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటున్నారు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. .
ఈ శక్తీ టీంలో వుండే మహిళా పోలీసులకు ప్రత్యేకంగా మూడు నెలల పాటూ సెల్ఫ్ డిఫెన్స్ పై ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వీరికి శిక్షణలో భాగంగా యోగా, జూడో, కరాటే, స్విమ్మింగ్, డ్రైవింగ్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటూ మహిళా చట్టాలపై కూడా అవగాహన కల్పించారు.
సో ఇకనుంచి నెల్లూరులో పోకిరీ కుర్రాళ్ళు అమ్మాయిలజోలికి వెళ్లకపోవడమే మంచిది.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Related Post: